News March 23, 2024
BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ?

BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆరూరి రమేష్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అవ్వగా.. ఈ పదవిని ఎవరికి ఇస్తారో అని సందిగ్ధం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కార్యకర్తలు, సీనియర్ లీడర్లు చాలామంది పార్టీ ఫిరాయించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్, పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డిలలో ఎవరో ఒకరికి ఈ పదవి రానున్నట్లు సమాచారం.
Similar News
News February 21, 2026
ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ పనులు చేపట్టాలి: కలెక్టర్

ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పెండింగ్ చెల్లింపులపై సమీక్షించి, సంబంధిత శాఖలు వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్ పాయ్‌తో కలసి జిల్లాలో పలు అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. రోడ్డు పనుల విషయంలో భూసేకరణ చేపట్టాలన్నారు.
News February 20, 2026
వరంగల్: తనిఖీలు లేకనే .. ఉపాధ్యాయుల గైర్హాజరు!

ప్రభుత్వ పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ, ఆకస్మిక తనిఖీలు లేనందునే ఉపాధ్యాయులు విధులకు హాజరై డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని నెక్కొండ మండలంలో ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో రంగయ్య నాయుడు శుక్రవారం సస్పెండ్ చేసిన క్రమంలో విద్యాశాఖ అధికారులు ఇన్నాళ్లకు మేల్కొన్నారా..!? అంటున్నారు. కొందరు హెచ్ఎంల కారణంగానే టీచర్లు డుమ్మా కొడుతున్నట్లు చర్చ సాగుతోంది.
News February 20, 2026
WGL: ప్రత్యేక తరగతులపై కొరవడిన పర్యవేక్షణ!

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఒక వైపు కలెక్టర్ చెబుతున్న.. మరోవైపు ప్రత్యేక తరగతుల నిర్వహణ అధ్వానంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం 8-9, సాయంత్రం 4.15 -5.15 గంటల వరకు స్పెషల్ క్లాస్‌లు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశాలున్నా, వాటిపై పర్యవేక్షణ లేదు. గతంలో మాదిరిగా ఇతర డిపార్ట్మెంట్ సిబ్బందిచే ఇన్విజిలేటర్ డ్యూటీస్, టెస్టులు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.


