News March 16, 2025
BRS రంగుల ప్రపంచాన్ని మాత్రమే చూపించింది: సీతక్క

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అన్నారు. గత 10 సంవత్సరాలలో కేవలం రంగుల ప్రపంచాన్ని మాత్రమే BRS చూపించింది.. కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజా పాలనలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే మహిళలను అణగ తొక్కడం అని ఆరోపించారు.
Similar News
News February 21, 2026
జగిత్యాల: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్కం రాజశేఖర్ (45) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుడి అన్న లక్కం శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
News February 21, 2026
కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్‌డ్‌లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్‌ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.
News February 21, 2026
డోన్‌లో ఘోర ప్రమాదం.. యువకుడి దుర్మరణం

డోన్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నయారా పెట్రోల్ పంపు వద్ద బైక్, ట్రాక్టర్ ఢీకొన్నాయి. బైకుపై వెళ్తున్న కృష్ణగిరి(M) ఆలంకొండకు చెందిన మునిరంగడు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


