News April 12, 2025
BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరండి: మాజీ ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి సమీపంలో BRS రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. రజాతోత్సవ సభకు సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నీళ్లు,నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి కేసీఆర్ ఆధ్వర్యంలో స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటాలు చేసిందన్నారు.
Similar News
News September 15, 2025
సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోల్ మంత్రి, కలెక్టర్

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్ర రాజధాని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు. అభివృద్ధి పదం వైపు నడుస్తున్న రాష్ట్రాన్ని, జిల్లాలను అధికారులు సమన్వయంతో పనిచేసే మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
News September 15, 2025
పెద్దపల్లి: ఈనెల 19న జాబ్ మేళా

నిరుద్యోగ యువకులకు టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు కల్పించుటకు SEP 19న సోమవారం MPDO ఆఫీస్ ఆవరణలోని టాస్క్ కేంద్రం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కాంటెంట్ మోడల్ అనలిస్ట్ పోస్ట్ లు ఖాళీలు ఉన్నాయన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించండి.
News September 15, 2025
KMR: నాటి ఇంజినీర్ల సృష్టి ఈ అద్భుతాలు!

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ కోట, లింగంపేట బావి, పోచారం ప్రాజెక్టులు ఆనాటి ఇంజినీర్ల నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. 103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తన సామర్థ్యాన్ని మించి వరదను తట్టుకుని నిలబడింది. ఈ నిర్మాణాలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటూ నాటి ఇంజినీరింగ్ ప్రమాణాలను నిరూపిస్తున్నాయి. ఆనాటి ఇంజినీర్ల కృషికి ఈ కట్టడాలు నిలువెత్తు నిదర్శనం.