News April 5, 2025
BRS రజతోత్సవ సభ.. ఖమ్మం నేతలతో KCR MEETING

బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీఅధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ మదన్ లాల్ నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కమల్ రాజ్ పాల్గొన్నారు.
Similar News
News April 6, 2025
భద్రాద్రి: గోదావరి తీరం రామమయం..!

రామనామ స్మరణతో గోదావరి తీరం మార్మోగనుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల్లో రామయ్య మురవనున్నాడు. వైభవోపేతంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి రెండు కళ్లు సరిపోవు. జై శ్రీరామ్ అంటూ భద్రాచలం తీరంలోని గోదావరి సవ్వడులు పరవళ్లు తొక్కుతాయి. ప్రతి ఏటా వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
News April 6, 2025
భద్రాచలానికి సీఎం రాక.. భారీ బందోబస్తు

భద్రాచలానికి సీఎం రేవంత్ రానున్న నేపథ్యంలో బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ హెలిపాడ్ గ్రౌండ్ వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందితో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఉదయం 10.45 గంటలకు భద్రాద్రి ఆలయానికి సీఎం రానున్నారు.
News April 6, 2025
లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఖమ్మం కలెక్టర్

పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-డీ, జూనియర్ లెక్చరర్, ఆర్ఆర్‌బీ, ఐడీబీసీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఎలాంటి పుస్తకాలు కావాలి, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.