News April 5, 2025
BRS రజతోత్సవ సభ.. పాలమూరు నేతలతో KCR MEETING

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 9, 2025
HYD: సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేయండి: సీపీ

నగరంలో రోజూ రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్‌లలో ప్రజలు మోసపోతున్నారని, డబ్బు ఊరికే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. APK ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
News November 9, 2025
ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
News November 9, 2025
కమీషన్ల కోసమే మేడారంలో కాలయాపన: నాగజ్యోతి

మేడారం జాతరకు మరో 70 రోజులే గడువు ఉన్నప్పటికీ పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. కమీషన్ల కోసమే అధికారులు పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పచ్చని మేడారాన్ని ఎడారిలా మార్చేశారని, షాపులు కోల్పోయిన వ్యాపారులకు తక్షణమే ప్రత్యామ్నాయం చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.


