News March 17, 2024
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ 100 ప్రశ్నలు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద తప్పులు చేసిందని బీఆర్ఎస్ విమర్శించింది. ‘రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతుభరోసా కింద రూ.15 వేలు ఇంకెప్పుడు? రైతుబంధును సీరియల్‌లాగా ఎంతకాలం సాగదీస్తారు? వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్ ఏమైంది? 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి? దళితబంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు?’ అంటూ 100 ప్రశ్నలు Xలో పోస్ట్ చేసింది.
Similar News
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

పురుషుల జీవితంలో అష్టలక్ష్ములు వీళ్లే..

పురుషుని జీవితంలో సుఖసంతోషాలు, భోగభాగ్యాలు సిద్ధించాలంటే ఆ ఇంట్లో మహిళల కటాక్షం ఎంతో ముఖ్యం. తల్లి (ఆదిలక్ష్మి) నుంచి కూతురు (ధనలక్ష్మి) వరకు, ప్రతి స్త్రీ స్వరూపం అష్టలక్ష్మికి ప్రతిరూపం. వారిని ఎప్పుడూ కష్టపెట్టకుండా వారి అవసరాలను, మనసును గౌరవించి, సంతోషంగా ఉంచడమే నిజమైన ధర్మం. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీలను గౌరవిస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి జరగడం ఖాయమని పండితులు చెబుతున్నారు.