News April 6, 2024
అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించిన BRS

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంబీపూర్ రాజు, మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు, కూకట్పల్లి-బేతిరెడ్డి సుభాశ్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, కంటోన్మెంట్-రావుల శ్రీధర్ రెడ్డిని నియమించింది.
Similar News
News December 9, 2025
మెటాకు షాక్.. 4 ఏళ్లలో $70 బిలియన్లు హాంఫట్

VR హెడ్ సెట్స్, స్మార్ట్ గ్లాసెస్‌తో గేమింగ్ కమ్యూనిటీకి చేరువకావాలనుకున్న మెటా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. నాలుగేళ్లలో 70 బిలియన్ డాలర్లు నష్టపోయింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రియాల్టీ ల్యాబ్స్ బడ్జెట్లో 30% కోత విధించాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనవరిలో లేఆఫ్స్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్ వాల్యూ పెరిగే వరకు MR గ్లాసెస్ లాంచ్‌ను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
News December 9, 2025
మండలానికొక జన ఔషధి కేంద్రం: సత్యకుమార్

AP: నకిలీ, నిషేధిత మందులు మార్కెట్లోకి రాకుండా నిఘా పెట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. ‘ఇటీవల 158 షాపుల్ని తనిఖీ చేస్తే 148కి సరైన అనుమతులు లేవు. సిబ్బంది అక్రమాలను ఉపేక్షించేది లేదు. అవసరమైన సిబ్బందిని APPSC ద్వారా కాకుండా MSRBతో నియమిస్తాం’ అని పేర్కొన్నారు. మండలానికొక జన ఔషధి కేంద్రం ఏర్పాటు యోచన ఉందన్నారు. 11 డ్రగ్ కంట్రోల్, 2 ల్యాబ్ భవనాల్ని మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
News December 9, 2025
పిల్లల ఎదుట గొడవ పడుతున్నారా?

తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే అది పిల్లల్లో భయం, ఆందోళనకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి వారి మానసిక ఆరోగ్యం, చదువు, నిద్ర, సామాజిక సంబంధాలను దెబ్బతీయవచ్చు. అలాగే పెద్దలను అనుకరించే పిల్లలు అదే ప్రవర్తనను తమ జీవితంలో అలవర్చుకునే ప్రమాదముంది. తల్లిదండ్రులు విభేదాలను శాంతంగా పరిష్కరించుకోవాలి.


