News August 12, 2025
బీఆర్ఎస్ బీసీ సభ వాయిదా

TG: ఈనెల 14న కరీంనగర్‌లో BRS నిర్వహించతలపెట్టిన బీసీ సభ వాయిదా పడింది. అల్పపీడనం కారణంగా 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. సభ తదుపరి నిర్వహణ తేదీని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కాగా ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది.
Similar News
News August 13, 2025
‘కూలీ’కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ సినిమాను రూ.350-రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రజినీ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. లోకేశ్ కనగరాజ్-రూ.50 కోట్లు, నాగార్జున-రూ.24 కోట్లు, అమిర్ ఖాన్-రూ.20 కోట్లు, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్-రూ.4 కోట్లు, అనిరుధ్-రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.
News August 13, 2025
లెఫ్ట్ హ్యాండర్స్ ప్రత్యేకతలు ఇవే..!

ఇవాళ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ప్రపంచ జనాభాలో 10-12 శాతం ఎడమ చేతి వాటం వారు ఉన్నారు. కుడి చేతివారితో పోలిస్తే లెఫ్ట్ హ్యాండర్స్‌కు స్వంతంత్ర భావాలు ఎక్కువ. వీరు ఒకేసారి ఎక్కువ పనులు చేస్తారు. షార్ప్, క్రియేటివిటీ, స్మార్ట్‌గా ఉంటారు. జబ్బు చేసినా, ప్రమాదాల్లో గాయపడినా త్వరగా కోలుకుంటారు. కొన్ని గేమ్స్ బాగా ఆడతారు. మెమొరీ పవర్ ఎక్కువ. వీరి ఆలోచనలు చాలా ఫాస్ట్. వీరిలో మేధావులు, రాజకీయవేత్తలు ఎక్కువ.
News August 13, 2025
మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్స్

బంగారం దిగుమతులపై ఎలాంటి టారిఫ్‌లు విధించమని ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ ధరలు తగ్గాయి. దీంతో HYD బులియన్ మార్కెట్‌లోనూ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.50 తగ్గి రూ.1,01,350కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.50 పతనమై రూ.92,900 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,25,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.