News August 23, 2025
యూరియా కొరతపై BRS,BJP డ్రామాలు: రేవంత్

TG: యూరియా కొరతపై సీఎం రేవంత్ రెడ్డి PAC సమావేశంలో స్పందించారు. ‘బీఆర్ఎస్, బీజేపీ కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయి. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని KTR అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశాను. యూరియా పంపిణీపై క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలి’ అని తెలిపారు.
Similar News
News August 24, 2025
కూలీ, వార్-2 కలెక్షన్లు ఎంతంటే?

రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. 74% రికవరీ చేసిందని, మరో రూ.80 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నాయి. మరోవైపు NTR, హృతిక్ నటించిన ‘వార్-2’ వరల్డ్ వైడ్‌గా రూ.314 కోట్లకు పైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
News August 24, 2025
100 దేశాలకు భారత్ నుంచి EVల ఎగుమతి: మోదీ

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్‌లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైల్ కోచ్‌లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
News August 24, 2025
రాహుల్‌కు, కాంగ్రెస్‌కు బిహార్‌లో గౌరవం లేదు: ప్రశాంత్ కిషోర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి బిహార్‌లో ఎలాంటి గౌరవం లేదని జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ RJDని అనుసరిస్తుందని విమర్శించారు. బిహార్‌లోని ప్రధాన సమస్యలైన వలస, అవినీతి, విద్య వంటి అంశాల గురించి ప్రస్తావించకుండా రాహుల్, PM మోదీ ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీంతో ప్రజలు తన పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు.