News July 31, 2024
రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపు

TG: సీఎం రేవంత్ దిష్టి బొమ్మల దహనానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిష్టి బొమ్మలను రేపు దహనం చేయాలని పిలుపునిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేవంత్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Similar News
News November 22, 2025
బ్లీచ్ చేయించుకుంటున్నారా?

చర్మం అందంగా మెరుస్తూ ఉండటంతో పాటు ట్యానింగ్ పోవాలని పార్లర్‌కి వెళ్లి చాలామంది స్కిన్‌కి బ్లీచ్ అప్లై చేయించుకుంటారు. బ్లీచ్‌ను చర్మానికి అప్లై చేసేముందు మాయిశ్చరైజర్ రాసి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బ్లీచ్ చేయించుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. లేకపోతే చర్మం పొడిబారిపోతుంది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చర్మానికి బ్లీచ్ అప్లై చేయకూడదు.
News November 22, 2025
హిందువులు లేకుంటే ప్రపంచమే లేదు: RSS చీఫ్

హిందువులు లేకపోతే ప్రపంచం ఉనికిలోనే ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘ప్రపంచంలోని ప్రతిదేశం అన్ని రకాల పరిస్థితులను చూసింది. యునాన్(గ్రీస్), మిస్ర్(ఈజిప్ట్), రోమ్, అన్ని నాగరికతలు కనుమరుగయ్యాయి. మన నాగరికతలో ఏదో ఉంది కాబట్టే మనం ఇంకా ఇక్కడున్నాం’ అని చెప్పారు. భారత్ అనేది అంతంలేని నాగరికతకు పేరు అని, హిందూ సమాజం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. మనం ఎవరిపైనా ఆధారపడకూడదని చెప్పారు.
News November 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


