News September 1, 2025
నేడు, రేపు ధర్నాలకు BRS పిలుపు

TG: ‘కాళేశ్వరం’ కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కుట్రలపై ఇవాళ, రేపు జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పార్టీ శ్రేణులకు సూచించారు. అంతకుముందు పార్టీ అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. కాగా కాళేశ్వరంపై తప్పుడు నివేదిక రూపొందించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News September 1, 2025
సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు?

దేవుళ్లు, దేవతలకు వాహనాలతోపాటు ఆయుధాలు కూడా ఉంటాయి. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంతో ప్రత్యేకం. ఈ ఆయుధ ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దీంతో రాక్షసులను ఓడించే దివ్య ఆయుధం కోసం ఆయన శివుడిని ప్రార్థించారు. దీంతో ముక్కంటి సుదర్శన చక్రాన్ని సృష్టించి విష్ణువుకు అందించారని శాస్త్రాలు చెబుతున్నాయి.
News September 1, 2025
చెప్పులో దూరిన పాము.. చూడకుండా ధరించడంతో!

వర్షాల వల్ల సర్పాలు, కీటకాలు ఇళ్ల బయట ఉంచిన చెప్పులు, హెల్మెట్స్‌లో తలదాచుకుంటుంటాయి. అలా బెంగళూరులో మంజు ప్రకాశ్ అనే యువకుడు ఇంటి బయట ఉంచిన చెప్పులను పరిశీలించకుండా ధరించాడు. దీంతో అందులో ఉన్న పాము కాటేసింది. గతంలో ఓ ప్రమాదం వల్ల ప్రకాశ్ తన కాలులో స్పర్శ కోల్పోవడంతో కాటేసినట్లు తెలియలేదు. అరగంట పాటు ఆ చెప్పులతోనే నడిచి ఇంటికెళ్లిన కొద్దిసేపటికే చనిపోయాడు. పాము కూడా మరణించింది.
News September 1, 2025
యమ ధర్మరాజు ప్రకారం పాపాలు ఏంటి?

పుణ్యాలు చేసిన వాళ్లు స్వర్గానికి, పాపాలు చేసిన వాళ్లు నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. యమధర్మరాజు ప్రకారం.. తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తులను తిట్టి హింసించేవారు, పరస్త్రీలను కామించేవారు, గోహత్య, శిశుహత్య చేసినవారు మహాపాపులవుతారు. ఇతరుల ఆస్తులను దోచుకొనేవారు, శరణుజొచ్చినవారిని కూడా బాధించేవారు, వివాహాది శుభకార్యాలకు అడ్డుతగిలేవారు కూడా పాపాత్ములే.