News August 20, 2024
22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు

TG: రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. 40శాతం మందికి రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులందరికీ తక్షణమే రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 15, 2026
అంటురోగాల వ్యాప్తిని గుర్తించేందుకు వెబ్‌లింక్

AP: అపరిశుభ్రత, కలుషిత తాగునీటితో వాంతులు, విరేచనాల వంటి అంటురోగాలు ప్రబలుతుంటాయి. వీటిపై స్థానిక సిబ్బందికి, వారినుంచి పై స్థాయికి సమాచారం చేరడంలో జాప్యంతో సమస్య జటిలం అవుతోంది. దీని నివారణ కోసం ప్రజలను భాగస్వాములను చేసేలా వైద్యశాఖ IHIP వెబ్ లింక్‌ను ఏర్పాటుచేసింది. అంటురోగాల సమాచారాన్ని ఫొటోలతో సహా వారు అందులో పొందుపర్చవచ్చు. మరిన్ని వివరాలకు <
News January 15, 2026
మిచెల్.. టీమ్ ఇండియా అంటే చాలు..

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మిచెల్ టీమ్ ఇండియా అంటే చాలు శివాలెత్తుతున్నారు. వన్డేల్లో ఇండియాపై 10 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ చేశారు. 5 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. సగటు 66.66గా ఉండటం విశేషం. 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ భారత్‌పై 134 పరుగులు చేశారు. లీగ్ మ్యాచులో 130 రన్స్‌తో చెలరేగారు. ప్రస్తుతం ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు.
News January 15, 2026
జనవరి 15: చరిత్రలో ఈరోజు

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం


