News March 24, 2024
BRSకు స్థానిక అభ్యర్థులు దొరకడం లేదు: రఘునందన్

TG: మెదక్‌లో బీఆర్ఎస్‌కు అభ్యర్థిగా స్థానికులు దొరకడం లేదా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు. ‘కరీంనగర్ నుంచి హరీశ్ రావును తీసుకొచ్చి మెదక్‌లో రుద్దారు. హరీశ్ రావు చాలదన్నట్లు ఇప్పుడు వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. తనది ఏ జిల్లా, ఏ ఊరో ఆయనకే తెలియదు. కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ప్రజలను దోచుకున్నారు. ఆ డబ్బును ఖర్చుపెట్టి గెలవాలని చూస్తున్నారు’ అని రఘునందన్ ఆరోపించారు.
Similar News
News November 21, 2025
చిత్తూరు: భారీగా పెరిగిన కూరగాయల ధరలు

జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాలకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పంట దిగుబడులు తగ్గి ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పచ్చిమిరప రూ.40 నుంచి రూ.60కి, బీర రూ.40-రూ.60, వంకాయలు రూ.90-రూ.120 వరకు చేరుకున్నాయి. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News November 21, 2025
‘సెన్‌యార్’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్‌యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 21, 2025
‘సెన్‌యార్’ తుఫాన్ – రైతులకు సూచనలు

‘సెన్‌యార్’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.


