News October 30, 2024
నేడు రాష్ట్రవ్యాప్తంగా BRS సంబరాలు
TG: రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడకుండా అడ్డుకున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా పబ్లిక్ హియరింగ్లో పాల్గొని దీనిపై ఈఆర్సీని ఒప్పించగలిగామన్నారు. విజయసూచికగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ఇవాళ సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Similar News
News October 30, 2024
ఒక్క ఏడాదిలోనే 2 లక్షల కిరాణా స్టోర్లు మూత.. కారణమిదే?
క్విక్ కామర్స్ దెబ్బతో దేశవ్యాప్తంగా గత ఏడాది 2 లక్షలకు పైగా కిరాణా దుకాణాలు మూతబడినట్లు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) అంచనా వేసింది. మెట్రో, టైర్-1 సిటీల్లో క్విక్ కామర్స్ వేగంగా పురోగమిస్తోందని, దీంతో కిరాణా స్టోర్లు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. డిస్కౌంట్లు, అతితక్కువ సమయంలోనే హోం డెలివరీతో కస్టమర్లు అటువైపు ఆసక్తి చూపుతున్నారని వివరించింది.
News October 30, 2024
‘పోలవరం’ ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం?
AP: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72M నుంచి కనీస నీటిమట్టం 41.15Mకే కేంద్రం పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకే ప్రాజెక్టు పూర్తి నిధులిచ్చేందుకు AUG 28న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఎత్తు తగ్గించడం వల్ల గరిష్ఠంగా 115.44TMCల నిల్వే సాధ్యమవుతుంది. వరద రోజుల్లో మినహా ఆయకట్టుకు నీటిని అందించడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
News October 30, 2024
నవంబర్ 2 నుంచి యాదాద్రిలో కార్తీక మాస పూజలు
TG: యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస పూజలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు. ప్రతి రోజు 6 బ్యాచుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. గుట్ట కింద వ్రత మండపంలో ఒకేసారి 2వేల జంటలు పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.