News August 28, 2024
BRS-కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి: BJP

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తోంది. ‘మద్యం కుంభకోణంలో అరెస్టయి జైలుకెళ్లిన నిందితురాలికి బెయిల్ రావడం, నిందితుల తరఫు న్యాయవాది రాజ్యసభకు నామినేట్ అవ్వడం ఒకేరోజు జరిగింది. ఈ సంఘటనల్లో ఒకదానికొకటి సంబంధం లేదు. యాదృచ్ఛికంగా జరిగింది’ అని సెటైర్లు వేసింది. BRS &కాంగ్రెస్ పేర్లు వేరైనా కుంభకోణాల్లో ఒక్కటే అని ట్వీట్ చేసింది. కాగా BJP-BRS ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
Similar News
News November 20, 2025
ఈ అలవాట్లతో రోగాలకు దూరం: వైద్యులు

ఆరోగ్య సమస్యలను డైలీ హ్యాబిట్స్ ద్వారా దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ‘రోజుకు 10వేల అడుగులు నడిస్తే శారీరక & మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. మెడిటేషన్ చేస్తే ఒత్తిడి & ఆందోళన తగ్గుతుంది. ఒకే సమయానికి నిద్ర పోవడం & మేల్కోవడం చేయాలి. సూర్యరశ్మి తగిలితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్ను తినకపోవడం బెస్ట్. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి’ అని సూచిస్తున్నారు.
News November 20, 2025
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాత్రికి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేయనున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి పర్యటన ముగిసిన తర్వాత హైదరాబాద్కు బయల్దేరి వెళ్లనున్నారు.
News November 20, 2025
‘జనజీవన స్రవంతి’ అంటే ఏంటంటే?

మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు అనే వార్తలు వింటుంటాం. ‘జనజీవన స్రవంతి’ అంటే సమాజంలో శాంతియుతంగా, చట్టబద్ధంగా జీవించడం. మావోయిస్టులు హింస, ఆయుధాలు & రహస్య జీవితాన్ని విడిచిపెట్టి, సాధారణ పౌరులుగా మారారని అర్థం. వారు ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విద్య, ఉద్యోగం వంటి ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఇది సూచిస్తుంది.


