News August 22, 2024
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నా

TG: రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ BRS నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయనుంది. రైతులకు అండగా నిలిచేందుకు ఈ కార్యాచరణకు పిలుపునిచ్చింది. రుణమాఫీకి బడ్జెట్లో రూ.31వేల కోట్లకు ఆమోదం తెలిపి, రూ.18వేల కోట్లే ఖర్చు చేసిన విషయాన్ని రైతులకు వివరించాలని కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంక్షలతో రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 1, 2025
నిర్మాతగా సుకుమార్ భార్య తబిత

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత నిర్మాతగా మారనున్నారు. ‘తబితా సుకుమార్ ఫిల్మ్స్’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బ్యానర్లో పదేళ్ల కిందట వచ్చిన బోల్డ్ మూవీ కుమారి21F సీక్వెల్ కుమారి22F తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రావు రమేశ్ నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు.
News November 1, 2025
ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.


