News August 16, 2024

కేసీఆర్‌కు అస్వస్థత అంటూ ప్రచారం.. ఖండించిన బీఆర్ఎస్

image

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానల్ ఫేక్ న్యూస్‌కు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ‘రుణమాఫీ పేరుతో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది’ అని ట్వీట్ చేసింది. ‘కేసీఆర్‌కు తీవ్ర అస్వస్థత’ అని టీకాంగ్రెస్ ఛానల్‌లో వచ్చినట్లు ఓ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. ఆ వార్త అవాస్తవమని స్పష్టం చేసింది.

Similar News

News February 1, 2026

కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

image

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News February 1, 2026

40% GST.. భారీగా పెరిగిన ధరలు

image

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.

News February 1, 2026

నిర్మలమ్మ పద్దు.. ₹54 లక్షల కోట్లు?

image

2026-27 కేంద్ర బడ్జెట్ ₹54 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే 7.9 శాతం ఎక్కువని చెబుతున్నాయి. 2025-26లో కేంద్రం ₹50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరోవైపు జీతం తీసుకునే వ్యక్తులకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కనీసం రూ.15 వేల వరకు పెరగొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.75 వేల నుంచి 90 వేలకు పెంచే అవకాశం ఉందని సమాచారం.