News September 8, 2025
BRSకు రాజకీయంగా కనెక్టివిటీ పోయింది: ఎంపీ చామల

TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేమని <<17647664>>BRS<<>> చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితంతో రాజకీయంగా వీరికి కనెక్టివిటీ పోయిందని దుయ్యబట్టారు. ఏ పార్టీకి చెందని సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలకు దూరంగా ఉండటం చూస్తే లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ అవసరం లేని పార్టీగా మారిపోయిందన్నారు.
Similar News
News September 8, 2025
నాకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదు: కాజల్

తనకు యాక్సిడెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఫన్నీగా ఉంటాయని తెలిపారు. దేవుడి దయతో తాను ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నానని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ఫోకస్ చేయకుండా నిజాలపై దృష్టి పెట్టాలని కోరారు. కాగా రోడ్డు ప్రమాదంలో కాజల్‌కు తీవ్రగాయాలు అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
News September 8, 2025
రేపటి నుంచే ఆసియా కప్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

రేపటి నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. గ్రూప్-Aలో భారత్, పాక్, UAE, ఒమన్, గ్రూప్-Bలో శ్రీలంక, బంగ్లా, అఫ్గాన్, హాంకాంగ్ తలపడతాయి. దుబాయ్, అబుదాబి వేదికల్లో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ 1, 3, 4, 5, సోని లివ్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. గ్రూపు దశలో భారత్ 10, 14, 19 తేదీల్లో మ్యాచులు ఆడనుంది.
News September 8, 2025
‘సృష్టి’ కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘<<17423890>>సృష్టి<<>>’ ఫర్టిలిటీ కేసులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు సస్పెండ్ అయ్యారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆంధ్ర వైద్య కళాశాల అనస్థీషియా HOD డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఉషాదేవి, శ్రీకాకుళం మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్యుల్లతను సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురిపై HYDలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలకు దిగింది.