News November 2, 2024

BRS పదేళ్లలో చేయని అభివృద్ధిని 10 నెలల్లో చేశాం: శ్రీధర్

image

TG: గత ప్రభుత్వం పేదలకు కాకుండా తమ బంధువులకు, కార్యకర్తలకు గృహాలు మంజూరు చేసిందని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. తాము పేదలందరికీ ఇళ్లు ఇస్తామని, ఇప్పటికే అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ₹10L వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. పదేళ్లలో BRS చేయలేని అభివృద్ధిని తాము 10 నెలల్లోనే చేశామని తెలిపారు.

Similar News

News October 28, 2025

ఆగిన రష్యన్ ఆయిల్ దిగుమతులు.. నెక్స్ట్ ఏంటి?

image

రష్యాలోని టాప్ ఎనర్జీ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో భారత రిఫైనరీలు కొత్తగా ఆయిల్ దిగుమతులపై వెనుకడుగు వేస్తున్నాయి. పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉండటమే ఇందుకు కారణం. ఈ విషయంలో ప్రభుత్వం, సప్లయర్ల నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫ్రెష్ ఆయిల్ టెండర్ జారీ చేసిందని, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాట్ బయ్యింగ్‌కు సిద్ధమైందని తెలిసింది.

News October 28, 2025

భగవద్గీతను ఎవరెందుకు చదవాలి?

image

భగవద్గీత మానవులందరికీ మార్గదర్శనం చేసే దివ్య గ్రంథం. విద్యార్థులు క్రమశిక్షణ కోసం, యువకులు సరైన జీవన విధానం కోసం, వృద్ధులు మరణానంతర ఆలోచనల కోసం, అజ్ఞానులు జ్ఞానం కోసం, ధనవంతులు దయ అలవరుచుకోవడానికి, బలవంతులు దిశానిర్దేశం కోసం, కష్టాల్లో ఉన్నవారు పరిష్కారం కోసం, వినయవంతులు ఔన్నత్యం కోసం భగవద్గీతను చదవాలి. మోక్షం కోరేవారు, అశాంతిగా ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఉత్తమ జీవితం కోసం గీతను అధ్యయనం చేయాలి.

News October 28, 2025

మొంథా తుఫాను.. ఈ జిల్లాల్లో రాకపోకలు బంద్

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8PM నుంచి రేపు 6AM వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.