News March 21, 2025

BRS వల్ల ఒక జనరేషన్‌ నాశనం: భట్టి

image

TG: రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఒక జనరేషన్ యువతను BRS నాశనం చేసిందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్లపాటు ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో వారు నష్టపోయారని అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ పెట్టినా పూర్తి నిధులను ఎప్పుడూ ఖర్చు చేయలేదు. దొడ్డిదారిన ఓఆర్ఆర్, ప్రభుత్వ భూములను అమ్ముకుంది. తర్వాత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా ముందే లాక్కుంది’ అని ఫైర్ అయ్యారు.

Similar News

News March 23, 2025

మే నుంచి కొత్త పింఛన్లు: మంత్రి

image

AP: రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది కొత్తగా పింఛన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మహిళల స్వయం సాధికారత, ఉపాధి కల్పన కోసం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

News March 23, 2025

ఆ సినిమా విషయంలో బాధతో చనిపోయేవాడినేమో: SJ సూర్య

image

తన కెరీర్‌ను మలుపుతిప్పిన ‘ఖుషి’ మూవీ గురించి నటుడు, దర్శకుడు SJ సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తమిళంలో ఖుషీ తొలి కాపీ చూసిన ఎవరికీ ఆ మూవీ నచ్చలేదు. విడుదలయ్యాక మాత్రం పెద్ద హిట్ అయింది. ముందు ఉన్న స్పందనే రిలీజ్ తర్వాతా కొనసాగి ఉంటే బహుశా ఆ బాధతో చనిపోయి ఉండేవాడినేమో’ అని పేర్కొన్నారు. తమిళంలో సూపర్ హిట్టైన అదే ‘ఖుషీ’ని తెలుగులో పవన్ కళ్యాణ్‌తో సూర్య రీమేక్ చేశారు.

News March 23, 2025

రేపటి నుంచి డీఈఈ సెట్ దరఖాస్తులు

image

TG: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈ సెట్‌కు ఈనెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 25న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు గతంలో కంటే రెండు నెలల ముందుగానే విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
వెబ్‌సైట్: <>deecet.cdse.telangana.gov.in<<>>

error: Content is protected !!