News May 3, 2024

బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉంది: సీఎం రేవంత్

image

TG: బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదని, కొన ఊపిరితో ఉందని సీఎం రేవంత్ అన్నారు. ‘మీరు ఆ పామును అసెంబ్లీ ఎన్నికల్లో నడుము, తోక మీద కొట్టారు. ఈసారి పడగ మీద కొడితే శాశ్వతంగా ఆ కాలనాగు పీడ విరగడవుతుంది’ అంటూ ప్రజలనుద్దేశించి ధర్మపురి సభలో ప్రసంగించారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కొప్పుల ఈశ్వర్‌నే ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఎద్దేవా చేశారు.

Similar News

News March 4, 2026

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి పీజీ, పీజీ(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd, MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://careers.amuonline.ac.in/

News March 4, 2026

నెయ్యి సరఫరాలో చంద్రబాబు స్కామ్‌లు: జగన్

image

AP: CM చంద్రబాబు తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని జగన్ Xలో విమర్శించారు. ‘TTD ఛైర్మన్‌పై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే CBN చర్యలు తీసుకోలేదు. అతడినే పదవిలో కొనసాగించి ఆలయ ప్రతిష్ఠను కాలరాశారు. లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరికి మీదికి నెట్టారు. నెయ్యి సరఫరాను ఇందాపూర్‌ డెయిరీకి కట్టబెట్టి స్కామ్‌లు చేస్తూ సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు’ అని ఆరోపిస్తూ <>డీటెయిల్స్<<>> షేర్ చేశారు.

News March 4, 2026

శాసనమండలిలో గందరగోళం

image

AP: మండలిలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ గందరగోళానికి దారితీసింది. ఛైర్మన్ ఒకే అంశంపై 2 తీర్మానాలను చర్చకు అనుమతించడం సరికాదని మంత్రి నాదెండ్ల అన్నారు. అలా అనుమతిస్తే ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ను వినాలన్నారు. అందుకు ఛైర్మన్ మోషేను రాజు అనుమతించకపోవడంతో ఇలాంటి చెడు సంప్రదాయాన్ని కొత్తగా తీసుకురావద్దని నాదెండ్ల వ్యాఖ్యానించారు. దీన్ని ఛైర్మన్ ఖండించగా, ప్రభుత్వం ఆయనను అవమానిస్తోందని YCP ఆందోళనకు దిగింది.