News April 20, 2024
ఏపీలో BRS నేత నామినేషన్

AP: రాష్ట్రంలో BRS నాయకుడు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత కొణిజేటి ఆదినారాయణ నామినేషన్ వేశారు. ప్రస్తుతానికి ఆయన ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో KCRను కలిసి బీఫామ్ అడగాలని నిర్ణయించుకున్నారు. కాగా APలో BRS పోటీపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆ పార్టీ సొంతింటిని చక్కదిద్దుకునే పనిలో పడింది. దీంతో ఏపీపై అంతగా దృష్టి సారించలేదని తెలుస్తోంది.
Similar News
News March 19, 2026
పుచ్చకాయలో పోషకాలు ఎన్నో!

పుచ్చకాయలోని 91-92% నీరు వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్, సిట్రులిన్ రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. తక్కువ క్యాలరీల వల్ల, బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. విటమిన్ A, C వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను సక్రమం చేస్తుంది. విటమిన్-C ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వ్యాయామం తర్వాత కండరాల నొప్పులను తగ్గించడంలో పుచ్చకాయ జ్యూస్ సాయపడుతుంది.
News March 19, 2026
రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్

TG: రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరంగా ఉండబోతోందని చెప్పారు. ఉగాది వేడుకల్లో మాట్లాడుతూ ‘అన్నదాతలకు ₹2లక్షల వరకు రుణమాఫీ చేశాం. భూభారతితో భూమి సమస్యలను పరిష్కరిస్తున్నాం. రైతు భరోసాకు ₹18వేల కోట్లు ఖర్చు పెట్టాం. ఈ నెల 22న మరో విడత డబ్బులు రిలీజ్ చేయనున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.
News March 19, 2026
IPL కోసం ఆల్కహాల్ మానేశా: చాహల్

6 నెలలుగా ఆల్కహాల్ మానేసినట్లు డివిలియర్స్ పాడ్‌కాస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ వెల్లడించారు. 35 ఏళ్ల వయసులో తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకుని IPLలో టీమ్ కోసం 150% శ్రమించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత సీజన్‌లో గాయాలతో ఇబ్బంది పడటం తనను నిరాశపర్చిందన్నారు. అందుకే ఈసారి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహిస్తున్నానని, పంజాబ్ కింగ్స్‌లో సీనియర్ ప్లేయర్‌గా రోల్ మోడల్‌గా ఉండాలనుకుంటున్నట్లు వివరించారు.


