News August 2, 2024
BRS నేతలు తల్లిలేని పిల్లలుగా మారారు: రాజగోపాల్ రెడ్డి

TG: ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంతో BRS నేతలు తల్లిలేని పిల్లలుగా మారారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో హరీశ్ రావు మంచి వర్కర్ కానీ ఆయనకు LOP ఇవ్వరన్న రాజగోపాల్.. కేటీఆర్‌కేమో అవగాహన లేదని విమర్శించారు. ఈ ఇద్దరిలో ఎవరికి LOP ఇచ్చినా ఆ పార్టీ నాశనమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Similar News
News October 26, 2025
రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు: APSDMA

AP: ‘మొంథా’ తుఫాను ఎల్లుండి రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు కాకినాడ, కోనసీమ, ప.గో., కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. SKL, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూ.గో., ఏలూరు, NTR, GNT, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
News October 26, 2025
ఇందిరమ్మ ఇళ్లు: చెల్లింపుల్లో స్వల్ప మార్పులు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బేస్‌మెంట్ వరకు రూ.లక్ష, రూఫ్ లెవల్ వరకు రూ.లక్ష, శ్లాబ్ వేశాక రూ.2 లక్షలు, చివర్లో రూ.లక్ష చొప్పున 4 విడతల్లో రూ.5 లక్షలిస్తున్నారు. ఇక నుంచి శ్లాబ్ వేశాక రూ.1.40 లక్షలే ఖాతాలో జమ అవుతాయని మంత్రి చెప్పారు. మిగతా రూ.60 వేలను ఉపాధి హామీ పథకం కింద ఇస్తామన్నారు.
News October 26, 2025
తులసి మొక్క ఇంటికి ఏ దిశలో ఉండాలి?

ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. ‘తులసి ప్రశాంతతను పెంచుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ మొక్క సూర్యునికి అభిముఖంగా, తూర్పు దిశలో ఉండటం శ్రేయస్కరం. ఉత్తరంలోనూ ఉండొచ్చు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ఉదయం కొంత సమయం తులసి దగ్గర గడపాలి. ఈ మొక్క ఎదుగుదల ఇంట్లోవారికి కొన్ని సూచనలిస్తుంది’ అని పేర్కొన్నారు. <<-se>>#Vasthu<<>>


