News March 11, 2025
నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్షం భేటీ

TG: తెలంగాణ భవన్‌లో KCR అధ్యక్షతన ఇవాళ BRS శాసనసభాపక్షం భేటీ కానుంది. బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ప్రజాప్రతినిధులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లడంపై మార్గనిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 17 లేదా 19న ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News March 4, 2026
గర్భిణుల్లో రక్తహీనతకు కారణం ఇదే!

కట్టెలు, పిడకలు మండించి వంట చేయడం వల్ల కలిగే వాయు కాలుష్యం ఇండియాలోని గర్భిణులలో రక్తహీనత ముప్పును 43% పెంచుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ‘దీనివల్ల వెలువడే విషవాయువులు రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, పేద మహిళలు దీని బారిన పడుతున్నారు. రక్తహీనతను తగ్గించి తల్లీబిడ్డల ఆరోగ్యం కాపాడాలంటే స్వచ్ఛమైన ఇంధనాన్ని వాడటం అత్యవసరం’ అని నిపుణులు సూచిస్తున్నారు.
News March 4, 2026
ఇంటర్వ్యూతో మెడికల్ ఆఫీసర్ పోస్టులు

<
News March 4, 2026
శాసన మండలి ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం?

AP: శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజుపై అవిశ్వాసం పెట్టాలని రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ రాజీనామాను ఇంతవరకూ ఆమోదించకపోవడంపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాసం పెట్టేందుకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో ఆ దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ ఈ లిస్టులో ఉన్నారు.


