News March 26, 2025
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన

TG: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. <<15893801>>ఫిరాయింపులపై సీఎం రేవంత్<<>> వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు సభ్యుల నిరసనను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సీఎం లేవనెత్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను స్పీకర్ పాటించట్లేదని సభ నుంచి వాకౌట్ చేశారు.
Similar News
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.
News November 12, 2025
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచుతాం: మంత్రి తుమ్మల

TG: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా.. మరో 12 లక్షల ఎకరాలు ఈ పంట సాగుకు అనువుగా ఉందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు.


