News August 16, 2024

BRS ‘విలీనం’ అంటూ వ్యాఖ్యలు.. ఎవరిని నమ్మాలి?

image

TG: కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ విలీనం కానుందంటూ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. BJPలో బీఆర్ఎస్ కలుస్తుందంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌లోనే విలీనం కానుందని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు తాము ఎవరితో కలవబోమని పార్టీలో సంస్థాగత మార్పులు చేస్తామని BRS పేర్కొంది. దీంతో ఎవరి మాటలను నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News November 22, 2025

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు!

image

దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కాలాలను బట్టి ఎండ, వానలు, చలి అన్నీ ఎక్కువగానే ఉంటున్నాయి. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (CSE) స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య 273 రోజుల్లో 270 రోజులు తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ ప్రభావంతో దేశంలో 4 వేల మందికి పైగా చనిపోయారని, 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని పేర్కొంది.

News November 22, 2025

‘యాషెస్’ను అసూయతో చూశా: సౌతాఫ్రికా కెప్టెన్

image

5 టెస్టుల యాషెస్ సిరీస్‌ను చూస్తే అసూయగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నారు. ఇండియాతో టెస్టు సిరీస్ 2 మ్యాచులకే పరిమితం చేయడంపై ఇలా అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘యాషెస్‌ను చూడటానికి ఉదయాన్నే మేం లేచాం. వాళ్లు 5 టెస్టులు ఆడుతున్నారని తెలిసి అసూయతో చూశాం’ అని చెప్పారు. త్వరలో పరిస్థితి మారుతుందని అనుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో భారత్‌తో 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు వస్తామని పేర్కొన్నారు.

News November 22, 2025

ఈనెల 24న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఈనెల 24న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 7 కంపెనీలలో 430 పోస్టులను ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండిన టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ పూర్తిచేసిన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8