News October 9, 2024

CM రేవంత్‌రెడ్డిని కలిసిన BRS MLA మల్లారెడ్డి

image

TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.

Similar News

News November 5, 2025

పిల్లల ముందు ఆ పనులు వద్దు!

image

పేరెంట్స్ ఏది చేస్తే చిన్న పిల్లలు వాటినే అనుకరిస్తారు. కొంతమంది భార్యాభర్తలు కిడ్స్ ముందే రొమాన్స్ చేస్తుంటారు. అది వారి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే పిల్లల ముందు ఇతరులను తక్కువ చేసి మాట్లాడటం, అనుచితంగా ప్రవర్తించడం వల్ల వాళ్లూ అలాగే తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక చిన్నారుల ముందు మందు తాగడం, సిగరెట్లు కాల్చడం వల్ల వారూ చెడు అలవాట్లకు గురయ్యే ఆస్కారం ఉంది. Share It

News November 5, 2025

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన అమెరికా

image

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘Minuteman-III’ను అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియాలోని స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ ప్రయోగం చేపట్టింది. అణు సామర్థ్యం గల ఈ మిసైల్ 6,760 KM ప్రయాణించి మార్షల్ ఐలాండ్స్‌లోని రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్‌లో ల్యాండ్ అయింది. న్యూక్లియర్ వెపన్ టెస్టింగ్ తిరిగి ప్రారంభిస్తామని ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం.

News November 5, 2025

కార్తీక పౌర్ణమి.. వెలుగు జిలుగుల్లో కాశీ

image

దేశంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. కాశీ పుణ్యక్షేత్రం దీపాల వెలుగుల్లో మెరిసిపోయింది. గంగా నది ఒడ్డున కాశీ ఘాట్‌ను వేలాది విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన డ్రోన్ ఫొటోలు అబ్బురపరుస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.