News September 21, 2024
పీఏసీ సమావేశం నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్

TG: పీఏసీ సమావేశం నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అధ్యక్షతన పీఏసీ సమావేశం ప్రారంభం కాగా, ఛైర్మన్ ఎన్నిక చెల్లదని BRS ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి, రమణ వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
Similar News
News November 14, 2025
ఉప ఎన్నికల విజేతలు వీరే

* జూబ్లీహిల్స్(TG)- నవీన్ యాదవ్(INC)
* అంతా(రాజస్థాన్)- ప్రమోద్ జైన్(INC)
* నువాపడా(ఒడిశా)- జయ్ ఢొలాకియా(BJP)
* నాగ్రోటా(J&K)- దేవయానీ రాణా(BJP)
* బడ్గాం(J&K)- ఆగా సయ్యద్ ముంతజీర్ మెహదీ(PDP)
* డంపా(మిజోరం)- లాల్థాంగ్లియానా(MNF)
* తరన్‌తారన్(పంజాబ్)- హర్మీత్ సింగ్ సంధు(AAP)
* ఘాట్‌శిలా(ఝార్ఖండ్)- సోమేశ్ చంద్ర సోరెన్(JMM)
News November 14, 2025
రహదారిపై షెడ్లు, నిర్మాణాలు చేయవచ్చా?

ఇంటి ముందు దారిపై వాహనం నిలపడం, కారు పార్క్‌కు షెడ్లు వేయడం సరికాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తమ సొంత స్థలంలో ఇలాంటి నిర్మాణాలు చేసుకోవాలి కానీ, అందరికీ చెందాల్సిన రహదారిలో ఆటంకం కలిగించేలా నిర్మాణాలు చేయడం ఆ ఇంటికి, ఇంట్లో సభ్యులకు మంచిది కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ధోరణితో గొడవలు, ప్రమాదాలకు ఆస్కారం ఉంది. వాస్తు శాంతికి సామాజిక శాంతి కూడా ముఖ్యమే’ అని అంటారు. <<-se>>#Vasthu<<>>
News November 14, 2025
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో CBN టాప్: పీయూష్

AP: భవిష్యత్‌ను ముందే ఊహించి CBN అవకాశాలను అందిపుచ్చుకుంటారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ CII సదస్సులో కొనియాడారు. ఒకప్పుడు IT, ఇప్పుడు డ్రోన్లు, స్పేస్, ఏఐ, క్వాంటమ్‌లలో ముందున్నారని చెప్పారు. ఫస్ట్ మూవర్స్ అడ్వాంటేజ్‌ని తామెప్పుడూ అందిపుచ్చుకుంటూనే ఉంటామని CM తెలిపారు. APలో డ్రోన్ ట్యాక్సీలు తీసుకువచ్చేలా అభివృద్ధి చేస్తామన్నారు. డ్రోన్, స్పేస్ సిటీలకు CM, మంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.


