News May 3, 2024
BRS MLC ఎన్నిక చెల్లదు: హైకోర్టు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. ఆ సమయంలో విఠల్ ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. విఠల్ ఎన్నిక చెల్లదంటూ తాజాగా తీర్పిచ్చింది. అలాగే ఆయనకు రూ.50వేల జరిమానా విధించింది.
Similar News
News January 3, 2025
చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం
TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.
News January 3, 2025
డబుల్ డెక్కర్‌గా విజయవాడ, వైజాగ్ మెట్రోలు
AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లై ఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.
News January 3, 2025
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!
TG: రేషన్ కార్డుదారులకు FEB లేదా మార్చి నుంచి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్కో మనిషికి 6KGలు ఇవ్వాలని, శనివారం జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్త వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని వెంటనే మిల్లుకు పంపిస్తే బియ్యం సరిగ్గా రావని, అందుకే 2నెలలు తర్వాత మిల్లాడించి పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.