News July 8, 2024

సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఆయన పార్టీ మారనున్నారనే <<13585753>>ప్రచారానికి<<>> బలం చేకూరినట్లైంది. రేవంత్ మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా చల్లా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News November 10, 2025

నా భర్త హీరోయిన్స్‌తోనే ఎక్కువ గడుపుతాడు: గోవింద భార్య

image

బాలీవుడ్ నటుడు గోవిందపై ఆయన భార్య సునీత సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తన కంటే హీరోయిన్స్ వద్దే ఎక్కువ సమయం గడుపుతాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో మహిళతో గోవింద అఫైర్ ప్రచారంపై స్పందిస్తూ ‘నేను ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోలేదు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయలేను. కాకపోతే ఆమె మరాఠీ నటి అని విన్నా’ అని అన్నారు. వివాదాలతో విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారాన్ని వీరిద్దరూ గతంలో ఖండించారు.

News November 10, 2025

విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సును విజయవంతం చేద్దామని మంత్రి లోకేశ్ సహచర మంత్రులకు పిలుపునిచ్చారు. ఈ సమ్మిట్‌తో ₹10L కోట్ల పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇచ్చిన హామీ మేరకు 20లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరువేరుద్దామని చెప్పారు. ప్రతీ మంత్రి తమ శాఖల పరిధిలోని ఒప్పందాల విషయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

News November 10, 2025

నిన్న అయ్యప్ప పూజకు హాజరు.. అంతలోనే..

image

TG: కవి అందెశ్రీ మరణాన్ని సాహితీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సమాచార హక్కు కమిషనర్ అయోధ్య రెడ్డి ఇంట్లో నిర్వహించిన అయ్యప్ప పూజకు ఆయన హాజరయ్యారు. రాత్రి కూడా బాగానే ఉన్నారని, భోజనం చేసి నిద్రపోయారని కుటుంబీకులు తెలిపారు. ఉదయం నిద్రలేపగా స్పందించలేదని, వెంటనే గాంధీకి తరలించినట్లు చెప్పారు. అయితే అప్పటికే అందెశ్రీ గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.