News March 17, 2024
కాంగ్రెస్‌లో చేరిన BRS ఎంపీ, ఎమ్మెల్యే
TG: BRS పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయమే కాంగ్రెస్ పార్టీలోకి గేట్లు తెరిచామని సీఎం రేవంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో కాసేపటి క్రితం అన్నారు.
Similar News
News December 23, 2024
కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలు.. వివరాలివే
TG: కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద రూ.2.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. వధూవరులు TG వాసులై, ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఎస్సీ వారై ఉండాలి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తై ఉండాలి. పెళ్లైన ఏడాదిలోపే అప్లై చేసుకోవాలి. తొలి వివాహానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <
News December 23, 2024
పరవాడ ఫార్మా సిటీలో ప్రమాదం
AP: అనకాపల్లి జిల్లా ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. రక్షిత డ్రగ్స్‌లో విషవాయువు లీక్ కావడంతో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.
News December 23, 2024
మోదీకి అంతర్జాతీయ పురస్కారాలు@20
ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ రాజు తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ను అందజేశారు. దీంతో ఇప్పటివరకు ఆయన అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 20కి చేరింది. ఆయనకు గతంలో బార్బడోస్, గయానా, డొమినికా, నైజీరియా, రష్యా, భూటాన్, ఫ్రాన్స్, US, UAE తదితర దేశాలు పురస్కారాలను అందించాయి.