News July 5, 2024
HYD మేయర్, డిప్యూటీ మేయర్పై BRS అవిశ్వాసం?

TG: రేపు జరిగే కౌన్సిల్ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని BRS నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 20, 2026
బరువు తగ్గాలా.. ఈ 3 రూల్స్ పాటించండి!

బరువు తగ్గాలనుకునే వాళ్లు ఈ 3 రూల్స్ పాటించడం ముఖ్యమని ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. 1.డోంట్ గివప్: జిమ్/డైట్ విషయంలో ఏదో చిన్న పొరపాటు జరగ్గానే మొత్తానికే మానేయకండి. 2.టైమ్లైన్: ఓవర్ నైట్లో సన్నబడాలన్న మైండ్ సెట్ మారాలి. ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అని అర్థం చేసుకోవాలి. 3.సాకులు వెతకొద్దు: జిమ్/డైట్ చేయలేనంత బిజీగా ఉన్నామని చెప్పొద్దు. మీ ప్రయారిటీ ఏంటో ఫిక్స్ చేసుకోవాలి.
News January 20, 2026
23న రాజధాని రైతులకు ఇ-లాటరీ: నారాయణ

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు. ‘అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈనెల 23న కేటాయిస్తాం. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించుకోవచ్చు. పెండింగ్లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు.
News January 20, 2026
మాఘ మాసంలో నదీ స్నానాలు ఎందుకు చేయాలి?

మాఘ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. శాస్త్రీయంగా చూస్తే.. ఈ సమయంలో సూర్యకిరణాలు ప్రత్యేక కోణంలో భూమిని తాకుతాయి. వాటిలోని అతినీల లోహిత సాంద్రత వల్ల ప్రవహించే నీటిలో చేసే స్నానం శరీరానికి గొప్ప శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. చలిని తట్టుకుని చేసే ఈ మాఘ స్నానం మనోబలాన్ని పెంచుతుంది.


