News November 8, 2024
బీఆర్ఎస్కు ప్రజల్ని దోచుకోవడమే తెలుసు: రేవంత్
TG: అణుబాంబులతో జపాన్లోని నగరాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయో మూసీతో హైదరాబాద్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్కు ప్రజలను దోచుకోవడమే తెలుసని మండిపడ్డారు. దగాపడ్డ తెలంగాణను బాగు చేసుకునే బాధ్యత తనపై ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు.
Similar News
News November 8, 2024
మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు: హరీశ్
KCR కాలిగోటికి కూడా సరిపోని రేవంత్ <<14562919>>CM<<>> స్థాయి దిగజారి మాట్లాడుతున్నారంటూ హరీశ్ రావు మండిపడ్డారు. ‘కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి పద్యం CMకు సరిగ్గా సరిపోతుంది. KCRపై నువ్వు చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయం. మూసీ నీళ్లతో కడిగినా నీ నోరు మురికి పోదు. నీ దొంగబుద్ధిని ప్రజాక్షేత్రంలో నిరూపిస్తాం. ప్రగల్భాలు మాని పరిపాలనపై దృష్టి పెట్టు’ అని ట్వీట్ చేశారు.
News November 8, 2024
SAvsIND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
భారత్తో డర్బన్లో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు: అభిషేక్, సంజూ, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, వరుణ్ చక్రవర్తి
సౌతాఫ్రికా జట్టు: ర్యాన్ రికెల్టన్, మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రూగర్, జాన్సెన్, సైమ్లేన్, కొయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్
News November 8, 2024
నో మోర్ మీడియా ట్రయల్స్: కేరళ హైకోర్టు
విచారణలో ఉన్న కేసుల విషయంలో దర్యాప్తు/న్యాయాధికారి పాత్ర పోషించకుండా మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. భావ ప్రకటనా, వాక్ స్వాతంత్య్రం ప్రాథమికాంశాలే అయినా తప్పొప్పులను నిర్ధారించేందుకు అది లైసెన్స్ కాదని వ్యాఖ్యానించింది. మీడియా ట్రయల్స్ వల్ల ప్రజల్లో ముందస్తు అభిప్రాయాలు ఏర్పడే అవకాశముందని, అది న్యాయవ్యవస్థపై అపనమ్మకానికి దారితీస్తుందంది.