News October 14, 2024
రాడార్ స్టేషన్ ఏర్పాటుకు BRS వ్యతిరేకం: KTR

TG: దామగుండం అడవుల్లో రాడార్ స్టేషన్ నిర్మాణానికి BRS వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పష్టం చేశారు. CM ఓవైపు మూసీకి మరణశాసనం రాస్తూ, మరోవైపు సుందరీకరణ చేస్తారా అని ప్రశ్నించారు. 10ఏళ్ల పాలనలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని కేటీఆర్ వెల్లడించారు. దీనికి వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి BRS పోరాటం చేస్తుందన్నారు.
Similar News
News March 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP: ECET-2025 నోటిఫికేషన్‌ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.
News March 10, 2025
ఇళ్లు కట్టుకునే వారికి GOOD NEWS

AP: ఇళ్లు కట్టుకునే SC, ST, BC లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, STలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1లక్ష సాయం అందనుంది. PMAY(అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది. దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణాపై రూ.15వేలు అందిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
News March 10, 2025
లవ్ హార్మోన్ పెంచే ఫుడ్స్ ఇవే..

సంతోషం, ప్రేమ కలిగినప్పుడు మెదడు విడుదల చేసే ఆక్సిటోసిన్‌ను లవ్ హార్మోన్ అని పిలుస్తుంటారు. దీనిని ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు డీ, సీ విటమిన్లు, మెగ్నీషియం మినరల్, ఒమెగా 3 వంటి హెల్తీ ఫ్యాట్స్ సాయం చేస్తాయి. సాల్మన్, మాకెరల్, టూనా వంటి చేపలు, అవకాడో, ఆరెంజెస్, నిమ్మ, ఆకుకూరలు, డార్క్ చాక్లెట్, గుడ్లు, డ్రై ఫ్రూట్స్‌లో పైన చెప్పినవి పుష్కలంగా దొరుకుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం!