News December 17, 2024

నేడు అంబేడ్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు

image

TG: లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నిరసనలు చేపట్టాలని BRS శ్రేణులకు KTR పిలుపునిచ్చారు. ఉ.11 గంటలకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని, జైళ్లలో నిర్బంధించి అణిచివేత విధానాలను అమలు చేస్తోందన్నారు.

Similar News

News February 13, 2026

తమన్నా ‘బోల్డ్’ హారర్.. ఆమిర్ ఖాన్ కొడుకుతో రొమాన్స్!

image

మిల్కీ బ్యూటీ తమన్నా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారారు. బాలీవుడ్ పాపులర్ హారర్ ఫ్రాంచైజీ ‘రాగిణి MMS’ థర్డ్ పార్ట్‌లో ఆమె నటించనున్నట్లు సమాచారం. ఏక్తా కపూర్ నిర్మించే ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. శశాంక ఘోష్ డైరెక్షన్‌లో రానున్న ఈ మూవీలో బోల్డ్ కంటెంట్‌తో పాటు ‘డేట్ నైట్ హారర్’ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌ను అలరించనున్నాయి.

News February 13, 2026

‘లోకల్’ ఫలితాలపై ‘గులాబీ’లో అంతర్మథనం

image

TG: మున్సి‘పోల్స్’ పై BRSలో అంతర్మథనం మొదలైంది. KTR, హరీశ్ మినహా పార్టీ MLAలు, నేతలు పోరాడిన స్థానాల్లో ఫలితం దక్కలేదు. గజ్వేల్, సిరిసిల్ల, దుబ్బాకలో గెలవగా మిగతా చోట్ల హంగ్, లేదా 2వ స్థానంలో నిలిచింది. జగదీశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సహా ఉమ్మడి నల్గొండలో విఫలమైంది. దయాకర్ రావు జిల్లా WGLలోనూ అంతే. హుజూరాబాద్, జమ్మికుంటలో కౌశిక్ దెబ్బతిన్నారు. HYD శివారులో పట్టు నిలుపుకొంది.

News February 13, 2026

రిలయన్స్‌కు వెనిజులా ఆయిల్.. లైసెన్స్ ఇచ్చిన అమెరికా!

image

వెనిజులా నుంచి డైరెక్ట్ ఆయిల్ కొనేందుకు రిలయన్స్‌కు US లైసెన్స్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఆంక్షల భయం లేకుండా ఆ కంపెనీ ఇకపై అక్కడి నుంచి నేరుగా క్రూడాయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ఉన్న రిలయన్స్‌కు దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో అరెస్ట్ తర్వాత అక్కడి ఆయిల్ ఇండస్ట్రీని US శాసిస్తోంది. మరోవైపు ఈ పరిణామంతో రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గనున్నాయి.