News January 22, 2025

GHMC మేయర్‌పై అవిశ్వాసానికి BRS ప్లాన్!

image

TG: GHMCపై రాజకీయంగా పట్టు నిలుపుకునేందుకు BRS వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ నుంచి మేయరై కాంగ్రెస్‌లో చేరిన విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తోంది. కాగా ప్రస్తుతం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో కలిసి మొత్తం 198 మంది ఉన్నారు. BRSకు 98 మంది మద్దతు ఉంటేనే అవిశ్వాసానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతిస్తారు. కానీ ఇప్పటి లెక్కల ప్రకారం BRS మద్దతుదారుల సంఖ్య 80కి మించడంలేదని విశ్లేషకుల అంచనా.

Similar News

News February 8, 2026

2030లో కూలిపోనున్న ISS!

image

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని NASA చెబుతోంది. 1998లో స్పేస్‌లోకి అడుగు పెట్టిన ISSని 2030లో పసిఫిక్ మహా సముద్రంలో కూల్చేయనున్నారు. ఈ బాధ్యతను ‘Space X’కు అప్పగించింది. భూభాగానికి వేల KM దూరంలోని ‘పాయింట్ నీమో’లో కూలుస్తారు. ఇయర్లీ మెయింటినెన్స్ పెరగడం, అనుకున్న దానికంటే ఎక్కువ కాలమే స్పేస్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News February 8, 2026

ఐర్లాండ్ టార్గెట్ ఎంతంటే?

image

T20WC: ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తడబడి నిలబడింది. తొలుత బ్యాటర్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచినా మెండిస్ ద్వయం అదరగొట్టింది. 20 ఓవర్లలో 163/6 రన్స్ చేసింది. కుశాల్ మెండిస్(56), కమిందు మెండిస్(44), నిస్సంక(24) మాత్రమే రాణించారు. IRE బౌలర్లు జార్జ్, మెక్కార్తీ చెరో 2, మార్క్ అడైర్, డెలానీలు చెరో వికెట్ తీశారు. ఐర్లాండ్ 20 ఓవర్లలో 164 రన్స్ చేయాలి.

News February 8, 2026

రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

image

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్‌లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్‌ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.