News March 27, 2024
వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం: మంత్రి పొన్నం

TG: వర్షపాతంపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. BRS హయాంలోనే వర్షాకాలం పూర్తయిందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని హరీశ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 9, 2026
నిర్మల్: ఈ నెల 13 నుంచి అరైవ్ అలైవ్ కార్యక్రమం

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేది నుంచి నిర్వహించే అరైవ్ అలైవ్ వీక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. 13వ తేదీన గ్రామ సభలు నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తరచు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు ఏమైనా ఉంటే గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
News April 9, 2026
మండిన ఎండలు.. 16 మండలాల్లో హై టెంపరేచర్

APలోని 16 మండలాల్లో ఇవాళ 40°C పైగా టెంపరేచర్ నమోదైంది. నంద్యాల(D) దొర్నిపాడు(M)లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. ఇక రేపు విజయనగరం(D)బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర.. మన్యం(D) బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం.. పోలవరం(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం.. ఏలూరు(D) కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తాయని చెప్పింది.
News April 9, 2026
ఇంటర్ ఫలితాలపై బోర్డు క్లారిటీ

TG: ఇంటర్ ఫలితాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ట్వీట్ చేసింది. గతంలో ఎప్పుడూ APR మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని గుర్తుచేసింది. మూల్యాంకన సమయాన్ని బట్టి ఫలితాల విడుదల తేదీ మారుతుందని, బోర్డు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది.


