News May 16, 2024
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసనలు

TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో BRS నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తానని సీఎం చెప్పడం రైతాంగాన్ని మోసం చేయడమేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. అలాగే రైతుభరోసా ఇవ్వట్లేదని, వడ్లు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తిన కేసీఆర్.. BRS కార్యకర్తలు రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు.
Similar News
News February 3, 2026
‘CM బ్రేక్ ఫాస్ట్’కు రూ.500కోట్ల ప్రపోజల్స్

TG: చీఫ్ మినిస్టర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌కు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రపోజల్స్ పంపించింది. మిడ్ డే మీల్స్ కోసం రూ.600 కోట్లు ఇవ్వాలని కోరింది. గతేడాది రూ.530 కోట్లు ఖర్చయిందని, గుడ్ల ధరలు పెరిగినందున ఎస్టిమేషన్స్ పెంచుతూ అధికారులు ప్రపోజల్స్ రెడీ చేసి పంపించారు. రాష్ట్రంలోని దాదాపు 28వేల స్కూల్స్‌లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News February 3, 2026
మళ్లీ తగ్గిన బంగారం ధర

బంగారం ధర ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,420 తగ్గి రూ.1,51,750కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,300 పతనమై రూ.1,39,100 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 3, 2026
ట్రంప్ డీల్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు <<19035036>>ట్రంప్ డీల్<<>> ప్రకటనతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగు తీస్తున్నాయి. ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా లాభపడి 84,015 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 734 పాయింట్ల లాభంతో 25,822 వద్ద కొనసాగుతోంది. BSEలోని అన్ని సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి.


