News August 17, 2024
రుణమాఫీపై రైతులతో కలిసి బీఆర్ఎస్ నిరసనలు
TG: రుణమాఫీపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ నామమాత్ర రుణమాఫీ చేసిందని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రేపటి నుంచి రైతులతో కలిసి ఆందోళనలు చేపట్టనున్నారు.
Similar News
News January 21, 2025
అమరావతిలో CII సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు
AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు.
News January 21, 2025
ఈ నంబర్ల నుంచి కాల్ వస్తే..
ఫేక్ బ్యాంక్ కాల్స్ వల్ల మోసపోతున్న వారిని రక్షించేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు లావాదేవీలు & మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెండు ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్లను ప్రవేశపెట్టింది. నంబర్ ‘1600’తో ప్రారంభమైతే బ్యాంకు ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన కాల్, ‘140’ సిరీస్తో వస్తే అది మార్కెటింగ్ కాల్ అని తెలిపింది. వీటి నుంచి కాల్స్/ మెసేజ్లు వస్తే బ్యాంకు పంపిందని అర్థం.
News January 21, 2025
రంజీ ఆడనున్న రోహిత్.. MCA కీలక నిర్ణయం
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడుతున్నారు. దీంతో MCA (ముంబై క్రికెట్ అసోసియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై-జమ్మూకశ్మీర్ మ్యాచ్ జరిగే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. హిట్మ్యాన్ ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారని, ఇందుకు తగినట్లుగా సీట్లు ఏర్పాటు చేయాలని భావించింది.