News November 17, 2024
బీఆర్ఎస్ను నిషేధించాలి: బండి సంజయ్

తెలంగాణలో BRSను నిషేధించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న BRS విధ్వంసకర పార్టీ అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలను నియంత్రించాల్సిన బాధ్యత సీఎందేనని, ఆయన అసమర్థత వల్లే వారు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇక TGలో ఇద్దరు సీఎంలు(రేవంత్, KTR) ఉన్నారని, కాంగ్రెస్, BRS కలిసి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నాయని బండి ధ్వజమెత్తారు.
Similar News
News January 24, 2026
మీడియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ

అదానీ గ్రూప్ మీడియా రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ (Indo Asian News Service)లో మిగిలిన 24% వాటాను కొనుగోలు చేసింది. దీంతో IANS పూర్తిగా అదానీ గ్రూప్ సంస్థగా మారింది. ఇప్పటికే 2023 డిసెంబరులో 50.5% ఉన్న వాటాను 2024 జనవరిలో 76 శాతానికి పెంచుకున్నారు. NDTV, బీక్యూ ప్రైమ్ తర్వాత ఐఏఎన్ఎస్ కూడా చేతికి రావడంతో మీడియాలో అదానీ ప్రభావం మరింత పెరగనుంది.
News January 24, 2026
బెంగాల్లో SIRపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి

WBలో నిర్వహిస్తున్న SIRపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో హడావిడిగా చేస్తున్న ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందన్నారు. ‘ఓటర్ల జాబితాను సమీక్షించాలనుకోవడంలో తప్పులేదు. ప్రస్తుతం బెంగాల్లో జరగుతున్నది అలా లేదు. ఓటు హక్కు నిరూపించుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అందించడానికి తగిన సమయమివ్వాలి’ అని చెప్పారు.
News January 24, 2026
776 మంది కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు!

TG: ఇటీవల నియామక పత్రాలు అందుకున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధుల్లో చేరారు. దీంతో ఆ స్థానాల్లో ఉన్న 776 మంది తాత్కాలిక(కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) సిబ్బందిని తొలగించాలని ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ప్రభుత్వ వైద్య కాలేజీలు, ఆసుపత్రులలో వారి సేవలను నిలిపివేస్తున్నట్లు DME ప్రకటించారు. రెగ్యులర్ నియామకాలు పూర్తికావడంతో వీరిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.


