News July 24, 2024

BRS వైఖరి ఇంకా మారలేదు: సీఎం రేవంత్

image

TG: తప్పులు చేసిన BRSను ప్రజలు శిక్షించారని, అయినా ఆ పార్టీ నేతల వైఖరి మారలేదని CM రేవంత్ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాన్ని విమర్శించారు. గత ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చినా రోడ్లు వేయలేదని, విద్యుత్ సౌకర్యం కల్పించలేదని అన్నారు. తాము అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. 7లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదని CM చెప్పారు.

Similar News

News January 20, 2026

LRS.. ఇలా అప్లై చేసుకోండి

image

AP: 2025 జూన్ 30లోపు రిజిస్టర్ అయిన <<18903924>>ప్లాట్లు<<>> లేదా లే అవుట్లు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయం లేదా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. lrsdtcp.ap.gov.inలోకి వెళ్లి సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, ప్లాట్ ప్లాన్, ఫొటోలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీజులో రూ.10వేలకు తగ్గకుండా ప్రాథమికంగా చెల్లించాలి. ఆ తర్వాత రాయితీ ఇస్తారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభ్యంతరాలు స్వీకరిస్తారు.

News January 20, 2026

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 పోస్టులు.. అప్లై చేశారా?

image

<>కొచ్చిన్ <<>>షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 210 వర్క్‌మెన్ పోస్టులకు అప్లై చేయడానికి JAN 23 ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.41,795 చెల్లిస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in/

News January 20, 2026

కురులు ఆరోగ్యంగా ఉండాలంటే..

image

మనం తినే ఆహారం ద్వారా చేరే పోషకాలను శరీరం ప్రధాన అంతర్గత అవయవాల కోసం కేటాయిస్తుంది. వాటిలో మిగిలినవి మాత్రమే వెంట్రుకలు, గోళ్లకు వెళ్తాయి. సరిపడా పోషకాలు తీసుకోకపోతే వెంట్రుకల మీద ఆ ప్రభావం పడి, రాలిపోతూ ఉంటాయి. కాబట్టి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాహారంతోపాటు, విటమిన్‌ ఇ, డి, సి, బి – కాంప్లెక్స్‌ అందేలా చూసుకోవాలి. ఇందుకోసం తాజా ఆకుకూరలు, కూరగాయలు, మాంసకృత్తులు సరిపడా అందించాలి.