News December 16, 2024
బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి: సీతక్క

TG: గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం బకాయిలు రూ.691 కోట్లు విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటే బాగుండేదని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. BRS అంటే బకాయిల రాష్ట్ర సమితిగా మారిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.274 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చామని హరీశ్ సమాధానమిచ్చారు.
Similar News
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్‌కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్‌కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.
News November 20, 2025
ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.
News November 20, 2025
రాజమౌళి సినిమాలు ఆపేస్తాం.. VHP వార్నింగ్

హనుమంతుడిపై వ్యాఖ్యలు చేసిన రాజమౌళి క్షమాపణ చెప్పకపోతే ఆయన సినిమాలు ఆపేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. రాముడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా అని VHP నేత తనికెళ్ల సత్యకుమార్ ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యలను ధర్మ ద్రోహంగా భావిస్తామని, డబ్బు గర్వంతో మాట్లాడితే VHP క్షమించదని స్పష్టం చేశారు. కాగా రాజమౌళి కామెంట్స్‌ను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు సైతం ఖండించారు.


