News August 16, 2024

అతి త్వరలోనే కాంగ్రెస్‌లో BRS విలీనం: బండి సంజయ్

image

TG: బీజేపీలో BRS విలీనం అవుతుందన్న CM రేవంత్ <<13869151>>వ్యాఖ్యలకు<<>> బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో BRS విలీనం తథ్యమని జోస్యం చెప్పారు. KCRకు AICC, కేటీఆర్‌కు PCC చీఫ్ పదవులు, కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు. BRSను బీజేపీలో విలీనం చేస్తేనే కవితకు బెయిల్ వస్తుందనుకోవడం మూర్ఖత్వమన్నారు. కాళేశ్వరం, డ్రగ్స్ కేసుల్లో KCR, KTRను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

Similar News

News October 21, 2025

ఇవాళ మధ్యాహ్నమే ‘మూరత్ ట్రేడింగ్’

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో దీపావళి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌గా భావిస్తారు. గత ఏడాది ఈ సెషన్‌లో మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. కాగా ఇవాళ, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు. మీరూ ‘మూరత్ ట్రేడింగ్’ చేస్తున్నారా?

News October 21, 2025

ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

image

దీపావళి వేళ దేశంలో చాలా ప్రాంతాలను వాయు కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలోని నరైనా గ్రామంలో నిన్న రాత్రి 11.39pmకు వాయు నాణ్యత సూచీ(AQI) 1991గా నమోదైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘హమారా ఢిల్లీ’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోనూ అర్ధరాత్రి AQI 150కిపైగా నమోదైంది. ఈ వాతావరణం అనారోగ్యానికి దారి తీస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

News October 21, 2025

తొలి వన్డేలో ఆ ప్లేయర్‌ను తీసుకోవాల్సింది: కైఫ్

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉండాల్సిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తుది జట్టులో అన్నీ కవర్ చేసినా వికెట్ టేకింగ్ బౌలర్‌ను తీసుకోలేదని చెప్పారు. AUS దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అన్ని ఫార్మాట్లలో రాణించారని గుర్తు చేశారు. తొలి వన్డేలో ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ 2 వికెట్లు తీశారని తెలిపారు. క్వాంటిటీ కోసం క్వాలిటీ విషయం రాజీ పడ్డారన్నారు.