News June 24, 2024
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు BRS!

TG: తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న MLAలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని BRS నిర్ణయించింది. ఈనెల 27న MLA దానం నాగేందర్ అనర్హత అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలను బట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపై ఒకేసారి SCకి వెళ్లాలని BRS భావిస్తోంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం MLAల అనర్హత పిటిషన్పై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ చెబుతోంది.
Similar News
News October 18, 2025
యమ దీపం ఎలా పెట్టాలంటే..?

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.
News October 18, 2025
BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

తెలంగాణలో బీసీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లతో రాజ్యమేలుతారనుకుంటే బంద్తో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం హడావిడిగా బిల్లు రూపొందించడం, దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టడం, హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే విధించడంతో తమ ‘నోటికాడ ముద్ద’ లాగేసుకున్నారని బీసీలు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ పరిణామానికి కారణమెవరు? Comment
News October 18, 2025
అత్యంత భారీగా తగ్గిన వెండి ధరలు

ధన త్రయోదశి వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండిపై ఏకంగా రూ.13వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.