News September 21, 2024
బీఆర్ఎస్ పీఏసీని తుంగలో తొక్కింది: యెన్నం శ్రీనివాస్

TG: నిబంధనల ప్రకారమే సీనియర్ సభ్యుడు అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్మన్‌గా నియమించినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడినట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పీఏసీని తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. గత పదేండ్లలో జరిగిన ఖర్చులను పీఏసీ తేల్చుతుందని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
దేశాధినేతలు.. మరణశిక్షలు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్‌లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్‌లో ముషారఫ్ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.

ఎసెన్స్‌లతో ఎన్నో లాభాలు

ఎసెన్స్‌లు సీరమ్స్‌లానే ఉంటాయి కానీ టెక్చర్ తేలికగా ఉంటుంది. ఎసెన్సుల్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ స్కిన్ మాయిశ్చర్ లెవెల్ పెంచి ఇతర స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడంలో సాయపడతాయి. టోనర్ తర్వాత, సీరమ్‌కు ముందు అరచేతులు లేదా స్ప్రే బాటిల్‌ని ఉపయోగించి ఎసెన్స్ అప్లై చేయాలి. టోనర్లు, ఎసెన్స్‌లు రెండూ స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్స్ మెరుగుపరచడానికి సినర్జిస్టిక్‌గా పనిచేస్తాయి.