News June 27, 2024

బీజేపీకి BRS ఓట్లు వేయించింది: CM రేవంత్

image

MP ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి BRS ఓట్లు వేయించిందని CM రేవంత్ ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కోసం తాము కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. BRSను బతికించేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఎంపీ ఎన్నికల్లో ఓడించినా KCRకు బుద్ధి రాలేదని రేవంత్ ఫైరయ్యారు.

Similar News

News November 24, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: మంత్రి కొండా

image

రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయ మాడవీధుల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని, ఐనవోలు, కొమురవెల్లి సహా అన్ని ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టామన్నారు. రాష్ట్రంలోని ఆల‌యాల అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

News November 24, 2025

హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

image

‘షోలే’ మూవీ షూటింగ్‌లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.

News November 24, 2025

ఢిల్లీ కాలుష్యం: సగం మందే ఆఫీసులకు

image

గాలి కాలుష్యం తీవ్రం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులను 50% మందితోనే నిర్వహించాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలిచ్చింది. GRAP-3లో భాగంగా వాహనాల రాకపోకలను నియంత్రించాలన్న ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోనివ్వొద్దని ఇప్పటికే ఆంక్షలు విధించింది.