News September 7, 2025
వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగు: మహేశ్ గౌడ్

TG: బీసీ రిజర్వేషన్లపై కేంద్రం దిగి వచ్చేలా ఈ నెల 15న కామారెడ్డి సభ ఉండనుందని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. BJP నేతలు దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కుంటారని ఫైరయ్యారు. లిక్కర్ రాణిగా కవిత నిజామాబాద్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. కవిత ఎపిసోడ్ KCR ఆడించే డ్రామా అని సందేహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని, వచ్చే ఎన్నికల నాటికి BRS కనుమరుగవుతుందన్నారు.
Similar News
News September 7, 2025
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..

నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ సీజన్-9 మొదలైంది. తొలి కంటెస్టెంట్‌గా తనూజ(ముద్దమందారం) హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఆశా/ఫ్లోరా సైనీ(సినీ నటి), కమెడియన్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ, సామాన్యుల కోటాలో పడాల పవన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్‌లో రెండు హౌస్‌లు ఉంటాయని నాగార్జున తెలిపారు. సామాన్యులుvsసెలబ్రిటీలుగా షో సాగే అవకాశం ఉంది. ఈ సారి 15 మందికిపైగా కంటెస్టెంట్లు ఉండనున్నట్లు సమాచారం.
News September 7, 2025
మరికాసేపట్లో చంద్రగ్రహణం

ఇవాళ రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం మొదలు కానుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఈ గ్రహణాన్ని ఎలాంటి పరికరం లేకుండా నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహణం సమయంలో ధ్యానం, జపం చేయడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News September 7, 2025
ఇంగ్లండ్ భారీ స్కోర్.. ఇద్దరు సెంచరీలు

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. రూట్(100), బెతెల్(110) సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 414 పరుగులు చేసింది. మరో ఇద్దరు బ్యాటర్లు 50+ స్కోర్లు చేశారు. బట్లర్ 32 బంతుల్లోనే 8 ఫోర్లు, ఓ సిక్సుతో 62* రన్స్ బాదారు. మెన్స్ వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ 7సార్లు 400+ స్కోర్ చేసింది. ఈ లిస్టులో సౌతాఫ్రికా(8) టాప్‌లో ఉంది.