News October 9, 2024
BRS ఇక అధికారంలోకి రాదు: రేవంత్

TG: బీఆర్ఎస్ ఇక అధికారంలోకి రాబోదని సీఎం రేవంత్ అన్నారు. ‘పదేళ్లుగా ఉద్యోగాలు లేవు, బదిలీలు లేవు. మేం వచ్చిన 60 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. విద్యారంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను పటిష్ఠం చేస్తున్నాం. డీఎస్సీని ఆపాలని గుంట నక్కలు, కొరివి దెయ్యాలు ప్రయత్నించాయి. తెలంగాణ సమాజం మీద కేసీఆర్కు ఎందుకంత కోపం’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News December 7, 2025
జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
News December 7, 2025
వేసవిలో స్పీడ్గా, చలికాలంలో స్లోగా కదులుతున్న హిమానీనదాలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాలు వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా కదులుతున్నట్లు నాసా గుర్తించింది. దశాబ్దం పాటు సేకరించిన శాటిలైట్ డేటా ఆధారంగా 36 మిలియన్లకుపైగా ఫొటోలను పరిశీలించి జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. 5 sq.km కంటే పెద్దవైన హిమానీనదాల ఫొటోలను పోల్చి కాలానుగుణంగా వాటి కదలికలను గుర్తించారు. ఫ్యూచర్లో హిమానీనదాల కరుగుదల అంచనాలో కదలికలు కీలకం కానున్నాయి.
News December 7, 2025
ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.


