News September 26, 2024
ఉపఎన్నికలు జరిగితే BRSకు డిపాజిట్ కూడా రాదు: కడియం

TG: అవినీతి, అక్రమాలకు BRS మారుపేరు అని MLA కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసిందని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉపఎన్నికలు జరిగితే BRSకు డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. కోర్టులపై తమకు గౌరవం ఉందన్నారు.
Similar News
News January 20, 2026
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News January 20, 2026
స్టార్ హోటళ్లు, రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ

AP: స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులతో టూరిస్ట్ హబ్‌గా విశాఖ మారుతోంది. నగరంలో ₹1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ITC ₹328 కోట్లతో హోటల్ నిర్మిస్తుండగా, అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీపంలో Oberoi సంస్థ 7-స్టార్ లగ్జరీ రిసార్ట్, హోటల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది. వీటితో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు వేలాది మందికి ఉపాధి దక్కనుంది.
News January 20, 2026
కరూర్ తొక్కిసలాట.. నిందితుడిగా విజయ్ పేరు?

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి CBI <<18898953>>విచారణకు<<>> నిన్న రెండోసారి విజయ్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలో ఆయన్ను నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఏడీజీపీ, మరో పోలీసు అధికారిపైనా అభియోగాలు మోపే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో CBI ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుందని, అందులో విజయ్ పేరు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు.


