News March 16, 2025
BRS తీరును ఖండిస్తూ జిల్లాలో కాంగ్రెస్ నిరసన

BRS నాయకులు దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు DCC అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. RR జిల్లా వ్యాప్తంగా KTR, జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి, BRS దళిత వ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 18, 2025
RR కలెక్టరేట్‌లో 72 ఫిర్యాదులు స్వీకరణ

ప్రజావాణి ఆర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఫిర్యాదుదారులు అందజేసిన ఆర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. రెవెన్యూ 40, ఇతర శాఖల్లో 32, మొత్తం 72 ఫిర్యాదులు స్వీకరించారు.
News March 17, 2025
RR: ఇంటర్ పరీక్షకు 84,599 మంది హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ 1st ఇయర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 87,313 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 84,599 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 2,714 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
News March 17, 2025
HYD: అమెరికాలో ప్రమాదం.. కొందుర్గు వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.